ఐనా నా పిచ్చి గానీ, ఇప్పుడనుకుని ఏం లాభం - మొదట్లొ ఉండాలి ఈ బుధ్ధి. మనం ఓటేసిన వాడెవడూ అధికారంలోకి రాలేదు. ఒకవేళ వచ్చినా మనని ఉధ్ధరించిందీ లేదు. ఆ మాటకొస్తే మనం సైటు కొట్టిన ఏ అమ్మాయీ మన దార్లోకి రాలేదు. ఈమాత్రానికి ఎవర్నో తిట్టుకోవడం ఎందుకు? అంతా మన ఖర్మం, మన తలరాత, మనకింతే ప్రాప్తం అనీ సరిపెట్టుకొవడం తప్ప మనం చేసేదేం లేదు. ఎఱ్ఱటెండలు కాస్తేనో నోట్లో మాటలు నోట్లోనే గడ్డలు కట్టేసేంత చలి కాస్తేనో ఊళ్ళూళ్ళే కొట్టుకు పోయేంత వరదలొచ్చినా మనమేం చెయగలిగేమనీ? ఇదీ అంతే అనుకునీ మిన్నకుండటమే మనం చేయగలిగింది.
నా చిన్నప్పుడు నాకెవడేనా చెప్పేడా నువ్వీ ఉద్యోగం చేస్తావని, నీకిలాంటి పెళ్ళాం దొరుకుతుందనీ! ఐనా చచ్చినట్టు ఇష్టం లేని ఈ ఉద్యోగమే చేయడం లెద - పక్క సీట్లలో అందాలు ఊరిస్తున్నా ఈ పెళ్ళాంతోనే కాపురం చేయడం లెదా? పోనీ మీకెవరికైనా ఎవరైనా చెప్పేరా మీకిలా జరుగుతుందని? అందుకే మనమంతా స్థితప్రజ్ఙత అలవాటు చెసుకోవాలి. అంటే ఏమిటన్నమాట? ఎవడేనా వచ్చి నీ జేబులో చెయ్యి పెట్టి ఉన్నదంతా ఊడ్చుకుపోతున్నా మనం ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఊరుకోవాలి తప్ప వాడినేమీ అనకూడదు. ఏలాగూ ఇది మనం రోజూ చేసేదే కదా? ఏవడిష్టం వచ్చినట్టు వాదు రేట్లు పెంచేసుకుంటూ పొతుంటే మనమేమంటున్నమనీ? ఏడ్చుకుంతూనే కొనుక్కుంటున్నాం కదా? అక్కడెక్కడొ జింబాబ్వేలో రొట్టె పది లక్షల డాలర్లంట. దాన్ని కొనుక్కుని తినేవళ్ళు ఎంత ధనవంథులో కదా? అంటే మనకేం అర్ధమవుతోందీ? రేట్లు పెరిగినాయని బాధ పడ్డం మానేసి, మనం వాటిని కొనుక్కొగలుగుతున్నాం అని సంతోషపడ్డం నేర్చెసుకుంటే ఎంతో హాయిగా కూడా ఉంటుంది కదూ? అంతకుమించి మనం చేయగలిగేదీ లేదు.
ఇలా ఎంత సణుక్కున్నా నా సణుగుడు నాక్కూడా వినిపించడం మానేసింది. ఇంక ఇవాళ్టికి సణగడం మానేసి మా ఆవిడెమన్నా తిండి పెడుతుందేమో చూడాలి. లేకపోతే ఇంకేం తినిపిస్తుందో కొంచెం భయంగా కూడ ఉంది. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం (మా ఆవిడ పెట్టింది తిన్నాక కూడా బతికుంటే)