తెలుగు ఎందుకు చదవాలీ? ఏంటి తెలుగు గొప్ప? అసలు ఎక్కడిదీ తెలుగు? ఈ సువిశాల ప్రపంచంలో ఉన్న ఐదు ఖండాల్లో ఓ ఖండంలోని ఒకదేశంలో ఓ మూల రాష్ట్రంలో ఏదొ కొద్దిమంది అభిమానం కొద్దీ మాట్లాడుకొనే ఓ పిచ్చి భాష! ఆ రాష్ట్రంలోనే పుట్టి (శారద గారు .. పాపం ... వారి దౌర్భాగ్యం కొద్దీ తెలుగు భాష మాట్లాడుకొనే రాష్ట్రంలోనే పుట్టారు) కూడా ఇంగ్లీషు భాషలోనే చదువుకుని తెలుగు భాషని మర్చిపోయి ఎందుకు తెలుగు నేర్చుకోవాలీ అని ప్రశ్నించే వాళ్ళున్నప్పుడు ఇంకెక్కడిదీ తెలుగు భాష? ఇప్పటికే చావనా మాననా అన్నట్టు కొట్టుకుంటున్న తెలుగుని ఎంతకాలం బతకనిస్తాం? మనమే చంపేద్దాం. బతికించినా - ఉద్యోగాలిస్తుందా - ఊళ్ళెలనిస్తుందా? ఇంగ్లీషునే నేర్చుకుందాం. ఇంచక్కా శారద గారిని సరడ (Sarada) గారూ అనో, షరడ (Sharada) గారూ అనో, షరఢ (Saradha) గారూ అనో పిలవొచ్చు. ఛా! యభయ్యారు అక్షరాలూ పైగా గుణింతాలూ, ఇంకా చాలా .. చాలా..! ఇంగ్లీషు లోనైతే చక్కగా 26 అక్షరాలే! పైగా వత్తులూ గుణింతాలూ లేవు. ఈ అక్షరాన్ని ఇలాగే పలకాలీ అనే పట్టింపూ లేదు. ఏలా పిలిస్తేనేం? ఇంగ్లీషు నేర్చుకుంటె ఉద్యోగాలూ, మంచి జీతాలూ వస్తాయ్. చాలదా? సరడ (Sarada) గారూ సారీ షరడ (Sharada) గారూ ..... మళ్ళీ సారీ ..... షరఢ (Sharadha) గారూ .... మళ్ళీ ఇంకోసారి సారీ ... ఏదో ఒకటి లెండి ..... మీ మాటే రైటు. మనమంతా ఇంగ్లీషే నేర్చుకుందాం. దాంతో వచ్చే ఉద్యోగాలు చెస్తూ తెలుగుకి తోకలేపి (ass) చూపిస్తూ గంతులేద్దాం.
(టపా లింకు http://sarada4u.blogspot.com/
4 కామెంట్లు:
అబ్బే, ఈ మండటం సరిపోదు.
ఆ బ్లాగు లో మీ కామెంటు తో పాటు ఈ టపాలింకు కూడా ఇవ్వాల్సింది.
ఎవరి పిచ్చి వారికానందం. పిచ్చి రాతలు చదివి అంతలా ఆవేశపడిపోతే ఎలా?
ఖమ్మం నుండి ఇంకెవరన్నా బ్లాగుతున్నారా.
ఓ పాలి ఖమ్మం బ్లాగర్ల మీట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి